మహర్షి నిడివి ఇంకా పెరగనుందా...?

మహర్షి నిడివి ఇంకా పెరగనుందా...?

వరసగా మహేష్ రెండో హిట్ కొట్టాడు.  మహర్షి సినిమాలోని కంటెంట్ యూనివర్సల్ గా అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో సినిమా హిట్టైంది.  రైతుల సమస్యలను, వాటికి పరిష్కారాలను చక్కగా చూపించారు.  ఇది సినిమాకు ప్లస్ అయింది.  అంతేకాదు, మహేష్ బాబు సినిమా ప్రచారంలో భాగస్వామ్యం కావడంతో ప్రేక్షకుల్లో జోష్ పెరిగింది.  

ఇదిలా ఉంటె, ఈ సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది.  మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ల మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి.  ఆ సీన్స్ ను సినిమాలో యాడ్ చేయబోతున్నారట.  వీటిని యాడ్ చేస్తే నిడివి మరింత పెరుగుతుంది.  ఇప్పటికే సినిమా రన్ టైమ్ మూడు గంటల వరకు ఉంది.  దీనిని ఇలా పెంచితే ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తారా...