మహర్షి ఎలా ఉందంటే..

మహర్షి ఎలా ఉందంటే..

మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా మహర్షి.  ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఇప్పటికే పలు ప్రాంతాల్లో సినిమా రిలీజ్ అయ్యింది.  తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో లు ముగిసాయి.  మరి టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.  ట్రైలర్ లో చెప్పినట్టుగా సినిమా ప్రపంచాన్ని సినిమా ఏలేసే విధంగా ఉందని టాక్ వినిపిస్తోంది.  అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని ట్విట్టర్ ద్వారా అర్ధం అవుతున్నది.  

ఫస్ట్ హాఫ్ యూత్ కోసం క్లాస్ ఆడియన్స్ కోసం అని, సెకండ్ హాఫ్ పక్కా మాస్ కోసం అనే విధంగా సినిమా ఉందని ట్వీట్ చేస్తున్నారు.  రైతులపై సింపతీ కాదు రైతుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకొని వాటికి సొల్యూషన్స్ కనుక్కోవాలని థీమ్ తో సాగే సినిమా అద్బుతంగా ఉందని ట్వీట్ చేస్తున్నారు.  కాస్త ఎక్కువైనా సినిమా నిడివి, కొన్ని సాంగ్స్ తప్పించి సినిమా మొత్తం సూపర్బ్ అని ట్వీట్ చేస్తున్నారు.  పూర్తి రివ్యూ తెలియాలంటే మరి కాసేపు ఆగాల్సిందే.