మహర్షి టీజర్ డేట్ వచ్చేసింది..!!

మహర్షి టీజర్  డేట్ వచ్చేసింది..!!

మహేష్ బాబు హీరోగా చేస్తున్న మహర్షి సినిమా షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటోంది.  రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన పల్లెటూరి సెట్ లో షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.  

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్, సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు.  సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు.   మహాశివరాత్రి రోజున అంటే మార్చి 4 వ తేదీన మహర్షి టీజర్ ను రిలీజ్ చేస్తారట.  ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ఏమంటే.. రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ ఫోన్ అయిందని తెలుస్తోంది.  ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.