మహర్షి టీజర్ ఎప్పుడంటే..!!

మహర్షి టీజర్ ఎప్పుడంటే..!!

మహేష్ బాబు మహర్షి సినిమా టాకీ పార్ట్ పూర్తయింది.  దీనికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది.  ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి.  ఈ రెండు పాటలను ఏప్రిల్ రెండో వారంలో షూట్ చేయబోతున్నారట.  మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి.  ఏప్రిల్ 25 న రిలీజ్ కావాల్సిన సినిమా మే 9 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.  

కాగా, ఈ సినిమా టీజర్ ను ఉగాది రోజున రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.  పూజా హెగ్డే, అల్లరి నరేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకుడు.  దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.