నైజాంలో మహర్షి రికార్డ్

నైజాంలో మహర్షి రికార్డ్

మే 9 వ తేదీన భారీ ఎత్తున రిలీజైన మహర్షి వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది.  నైజాం ఏరియాలో ఈ సినిమా ఏకంగా నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది.  మొదటిరోజు ఈ సినిమా నైజాంలో రూ.6.38 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  బాహుబలి 2 తరువాత ఈ స్థాయి వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది మహర్షి.  

బాహుబలి 2 రూ.8.95 కోట్లు వసూలు చేయగా, బాహుబలి 1 రూ.6.26 కోట్లు వసూలు చేసింది.  అటు చెన్నైలో కూడా ఈ మూవీ మంచి వసూళ్లు సాధించినట్టు వార్తలు వస్తున్నాయి.