మహేష్ 'మహర్షి' పరిస్థితి ఏంటి ?

మహేష్ 'మహర్షి' పరిస్థితి ఏంటి ?

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కలయికలో రూపొందుతున్న సినిమా 'మహర్షి'.  మహేష్ చిత్రం 'స్పైడర్' ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.  ప్రస్తుతం ఆఖరి దశ చిత్రీకరణ జరుగుతోంది.  తాజా సమాచారం ప్రకారం ఈరోజుతో తమిళనాడు పొల్లాచ్చిలో చేస్తున్న షూటింగ్ ముగిసిందని, ఫిబ్రవరి నుండి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది.  ఇది హైదరాబాద్లోనే జరుగుతుంది.  ఏప్రిల్ నెలాఖరున ఈ సినిమా విడుదలకానుంది.  ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర చేస్తుండగా పూజ హెగ్డే కథానాయిక పాత్రను చేస్తోంది.