మొదటి వారంలోనే పిండాలంటున్న 'మహర్షి' !

మొదటి వారంలోనే పిండాలంటున్న 'మహర్షి' !

'మహర్షి'.. భారీ బడ్జెట్ కేటాయించి ముగ్గురు బడా నిర్మాతలు నిర్మించిన సినిమా.  ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం బాగానే జరిగింది.  లెక్కలు చూసుకుంటే సినిమా వసూళ్లు భారీ మొత్తంలో వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు.  అలా రావాలంటే వేడి మీదున్నప్పుడే దండుకోవాలి.  అందుకే సినిమా టికెట్లు రేట్లు పెరిగాయి.  తెలంగాణలో రోజుకు ఐదు షోల పర్మిషన్ తెచ్చుకున్నారు.  వీటి ద్వారా మొదటి వారంలోనే వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలనేది ప్లాన్.  సినిమా ఎలా ఉన్నా   మొదటి వారం వసూళ్లకు డోకా ఉండదు.  ఒకవేళ బాగుంటే ఎలాగు నెల రోజుల లాంగ్ రన్ ఉంటుంది.  కాబట్టి కీలకమైన మొదటి వారాన్ని గట్టిగా టార్గెట్ చేశారు.  చూడాలి మరి 'మహర్షి' మొదటి వారాన్ని ఎలా క్యాష్ చేసుకుంటాడో చూడాలి.