బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మహర్షి టీమ్

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మహర్షి టీమ్

మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సినిమా మే 9 వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్టైంది.  అన్ని చోట్ల భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాను తెలంగాణలో మహేష్ అండ్ కో ప్రచారం నిర్వహించారు.  సినిమా రిలీజ్ తరువాత ఇలా ప్రచారం చేసి చాలా రోజులైంది.  తెలంగాణ తరువాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. 

విజయవాడలోని సిద్దార్ధ కళాశాల మైదానంలో విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు.  ఈ సభకు వేలాదిమంది అభిమానులు హాజరవుతారని సమాచారం.  ఇదిలా ఉంటె, మహేష్ బాబు అండ్ కో టీమ్ విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకుంది.  అక్కడి నుంచి సిద్దార్ధ కళాశాలలో జరిగే విజయోత్సవ సభకు హాజరవుతారని సమాచారం.