ఎవరెస్టు అంచున అంటోన్న మహేష్

ఎవరెస్టు అంచున అంటోన్న  మహేష్

మహేష్ బాబు మహర్షి మే 9 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో రెండు సింగిల్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు.  మహేష్ ను ఇంట్రడ్యూస్ చేసే సాంగ్ ఒకటికాగా రెండోది స్నేహం గురించి చెప్పే సాంగ్.  ఈ రెండు సాంగ్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.  రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు రెట్టింపయ్యాయి.  

ఇదిలా ఉంటె, మహర్షిలోని మూడో సింగిల్ ఎవరెస్టు అంచున అనే సాంగ్ ను ఏప్రిల్ 19 వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.  ఈ విషయాన్ని దర్శకుడు వంశి పైడిపల్లి స్వయంగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.  ఎవరెస్టు అంచున సాంగ్ కు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ లో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నది.