'మహర్షి' కొత్త రికార్డులు !

'మహర్షి' కొత్త రికార్డులు !

మహేష్ నటించిన తాజా చిత్రం 'మహర్షి' ట్రైలర్ నిన్ననే విడుదలైంది.  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే 2 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసేసింది.  ట్రైలర్ కంటెంట్ బాగుండటంతో అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ మొదటి స్థానంలో ట్రెండ్ అయింది.  అభిమానుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా సరికొత్త రీకార్డులు క్రియేట్ చేసేలా కనబడుతోంది.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.  ఇది మహేష్ చేసిన 25వ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి.