టీవీ9కు కొత్త సీఈవో, సీవోవో..

టీవీ9కు కొత్త సీఈవో, సీవోవో..

టీవీ 9కు కొత్త సీఈవోను నియమించింది డైరెక్టర్ల బోర్డు... మహేంద్ర మిశ్రాను టీవీ9కు సీఈవో (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌)గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన డైరెక్టర్లు.. రవి ప్రకాష్‌ను టీవీ9 సీఈవో పదవి నుంచి తొలగిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. మరోవైపు గొట్టిపాటి సింగారావును సీవోవో (చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌)గా నియమిస్తూ ఏబీసీఎస్ డైరెక్టర్లు బోర్డు తీర్మానం చేసింది. మహేంద్ర మిశ్రా టీవీ9 సీఈవోగా వెంటనే బాధ్యతలు తీసుకున్నారు. కాగా, మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్‌గా ఉన్నారు. అలాగే గొట్టిపాటి సింగారావు.. గతంలో మా టీవీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా ఉన్నారు గొట్టిపాటి సింగారావు.