ముహూర్తం కుదిరింది

ముహూర్తం కుదిరింది

మహేష్ 25 వ సినిమా మహర్షి హిట్ తరువాత మహేష్ ... అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 వ తేదీన ప్రారంభం కాబోతున్నది.  ఎప్పుడు ఎన్ని గంటలకు సినిమా ప్రారంభం కాబోతున్నది అనే విషయాలను మాత్రం స్పష్టంగా చెప్పలేదు.  

తాజా సమాచారం ప్రకారం మహేష్ 26 వ సినిమా మే 31 వ తేదీ ఉదయం 9:18 గంటలకు ప్రారంభం కాబోతున్నది.  అన్నపూర్ణ స్టూడియోస్ లో అతిరధ మహారథుల సమక్షంలో సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నట్టు యూనిట్ తెలిపింది.  ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో ఉన్నారు.  అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.  రష్మిక మందన్న హీరోయిన్.