మహేష్ 26 మొదలయ్యేది అప్పుడే !

మహేష్ 26 మొదలయ్యేది అప్పుడే !

మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.  మహేష్ హాలీడే నుండి తిరిగిరాగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ కానుంది.  ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేయనున్నారు.  అలాగే జూలై 26 నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెడతారు.  మొదటిసారి మహేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్  సబ్జెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.  ఇందులో కథానాయకిగా రష్మిక మందన్నను అనుకుంటున్నారట.