పోకిరి కంటే పెద్ద హిట్టవుతుందని చెప్పా : మహేష్

పోకిరి కంటే పెద్ద హిట్టవుతుందని చెప్పా : మహేష్

 

మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్బంగా టీమ్ సక్సెస్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది.  నిన్న జరిగిన ఒక విజయోత్సవ ఈవెంట్లో మాట్లాడిన మహేష్ ఈ సినిమా మొదటిరోజు షూట్ ముగియగానే యూనిట్ సభ్యులకు, స్నేహితులకు చెప్పా ఈ సినిమా పోకిరి స్క్వయర్ అవుతుందని.  అలాగే అయింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.  వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను అశ్వినీ దత్, పివిపి, దిల్ రాజులు నిర్మించారు.  ఇప్పటి వరకు 150 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం త్వరలోనే 200 కోట్ల జాబితాలోకి చేరే అవకాశాలున్నాయి.