ఆ దర్శకుడి కోసం మహేష్.. ఎన్టీఆర్ పోటీ..!!?

ఆ దర్శకుడి కోసం మహేష్.. ఎన్టీఆర్ పోటీ..!!?

కేజీఎఫ్ సినిమాతో ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.  కేజీఎఫ్ అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించింది.  ఈ సినిమా విజయం తరువాత ప్రస్తుతం సెకండ్ పార్ట్ పై దృష్టి పెట్టారు.  సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతున్నది.  వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.  ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధం అయ్యారని, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.  

అయితే, ఇటీవలే ప్రశాంత్ ఓ లైన్ ను మహేష్ బాబుకు వినిపించారని, ఆ లైన్ మహేష్ కు బాగా నచ్చిందని, స్క్రిప్ట్ రెడీ చేయమన్నారని, పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక నచ్చితే సినిమా చేద్దాం అని అన్నారని సమాచారం.  దీంతో మహేష్ బాబుతో సినిమా కోసం ప్రశాంత్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటు ఎన్టీఆర్, అటు మహేష్ బాబు ఇద్దరు ప్రశాంత్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతుండటంతో.. ఎవరి సినిమా ముందు ఉంటుంది.. ఎవరి సినిమా నెక్స్ట్ ఉంటుంది అన్నది సందిగ్ధంలో  పడింది.