మహేష్ బాబు 'రాజసం' ఉట్టిపడేలా..!!

మహేష్ బాబు 'రాజసం' ఉట్టిపడేలా..!!

 కొరటాల దర్శకత్వం వహించిన భరత్ అనే నేను  మంచి విజయం సాధించడంతో మహేష్ బాబు  తిరిగి గాడిలో పడ్డాడు. వరస ప్లాప్ ల తరువాత వచ్చిన హిట్ సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు హీరోగా సి అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసునేందుకు  సిద్ధమయ్యారు.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది.  ఎక్కువ భాగం షూటింగ్ అమెరికా పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని యూనిట్ చెప్తోంది.  

ఇప్పటి వరకు మామూలు లుక్ లో కనిపించిన మహేష్ వంశి పైడిపల్లి సినిమా కోసం డిఫరెంట్ గా కనిపించబోతున్నారట.  దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  మహేష్ బాబు గడ్డం.. మీసంతో సీరియస్ లుక్ ఉన్న పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.  రాజసం అనే టైటిల్ ఉన్న ఈ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  మహేష్ 25 వ సినిమాకు రాజసం అనే టైటిల్ ను అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనే విషయం తెలియాలి.  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రను చేస్తున్నారట.