సుకుమార్‌తో సినిమా చేయట్లేదు : మహేష్

సుకుమార్‌తో సినిమా చేయట్లేదు : మహేష్

మొన్నటి వరకు మహేష్ బాబు తదుపరి సినిమాల జాబితాలో సుకుమార్ చిత్రం కూడా ఉండేది.  'మహర్షి' తరవాత ఆయనతోనే మహేష్ సినిమా స్టార్ట్ చేస్తాడని అనుకున్నారంతా.  కానీ నిన్న సుకుమార్ నెస్ట్ మూవీ అల్లు అర్జున్ తో చేస్తాడని అనౌన్స్ అయింది.  దీంతో మహేష్ సినిమా ఏమైనట్టు అనే డైలమాలో పడ్డారు అభిమానులు. 

వాళ్ళకి క్లారిటీ ఇస్తూ మహేష్ బాబు కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సుకుమార్‌తో సినిమా చేయలేకపోతున్నానని ప్రకటించాడు.  అంతేకాదు సుకుమార్ తర్వాతి సినిమాకి అభినందనలు తెలుపుతూ ఆయనతో కలిసి చేసిన 'వన్ నేనొక్కడినే' చిత్రం ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని చెప్పుకొచ్చాడు.