మహేష్ బాబు ... అరవింద్ సినిమా ఉంటుందా..?

మహేష్ బాబు ... అరవింద్ సినిమా ఉంటుందా..?

మహేష్ బాబు .. సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయింది.  కారణాలు ఏంటనే విషయాన్ని పక్కన పెడితే.. సినిమా క్యాన్సిల్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  సుకుమార్ తో క్యాన్సిల్ తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది.  ఈ సినిమా షూటింగ్ మే నుంచి ప్రారంభం కాబోతున్నది.  

ఇదిలా ఉంటె, మహేష్ బాబు.. అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది.  అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.  సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ తో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా తరువాత మహేష్.. అల్లు అరవింద్.. సందీప్ రెడ్డి వంగ సినిమా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.  ఈ ఏడాదే సినిమా అనుకున్నా కుదరలేదు కాబట్టి వచ్చే ఏడాది ఈ కాంబినేషన్లో సినిమాను ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో.