బిగ్ బాస్ 2 విన్నర్ కు మహేష్ బాబు బిగ్ స‌ర్‌ప్రైజ్‌

బిగ్ బాస్ 2 విన్నర్ కు మహేష్ బాబు బిగ్ స‌ర్‌ప్రైజ్‌

బిగ్ బాస్ 2 సీజన్ ముగిసింది.  ఈ సీజన్ ఆద్యంతం ఆకట్టుకుంది.  మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఎవరు విన్ అవుతారు అనే దానిపై భారీ ఉత్కంఠతను నెలకొంది.  చివరకు అనుకున్నట్టుగానే కౌశల్ విన్ విజయం సాధించాడు.  పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఉండాలో.. అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో కౌశల్ చక్కగా ప్రదర్శించాడు.  సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ క్రియేట్ అయ్యి సపోర్ట్ చేయడం కౌశల్ కు కలిసి వచ్చింది.  కౌశల్ విజయం సాధించడంతో అనేక మంది సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేస్తున్నారు. 

బిగ్ బాస్ 2 లో విజయం సాధించిన కౌశల్ కు మహేష్ బాబు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.  కౌశల్ కు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశాడు.  మహేష్ ట్వీట్ చెప్పడంతో కౌశల్ పేరు మరోమారు మారుమ్రోగి పోయింది.