మహేష్ యూఎస్ ఈవెంట్ క్యాన్సిల్ !

మహేష్ యూఎస్ ఈవెంట్ క్యాన్సిల్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు మా అసోసియేషన్ తరపున అమెరికాలో ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది.  మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు.  ఇదే ఈవెంట్ ద్వారా మహేష్ కూడ తాను రన్ చేస్తున్న ఒక హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ కోసం ఫండ్స్ రైజ్ చేయాలనీ భావించారు. 

కానీ మా అసోసియేషన్ ముఖ్య సభ్యులు శ్రీకాంత్, నరేష్, శివాజీరాజాల నడుమ విభేదాలు తలెత్తడం, గతంలో చిరంజీవితో చేసిన ఈవెంట్ తాలూకు నిధులు దుర్వినియోగం అయ్యాయని గొడవలు రావడం, అమెరికాలో తెలుగు వారి నుండి కార్యక్రమానికి పెద్దగా స్పందన రాకపోవడంతో మహేష్ మొత్తానికి ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్నారట.