09:09:09 ఏం జరగబోతున్నది..!!

09:09:09 ఏం జరగబోతున్నది..!!

ఆగష్టు 9 ... మహేష్ బాబు బర్త్ డే.. స్టార్స్ బర్త్ డే రోజున ఫాన్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  ఈ ఏడాది మహేష్ బాబు బర్త్ డే రోజున సరిలేరు నీకెవ్వరూ నుంచి ఓ న్యూస్ బయటకు రాబోతున్నది.  ఆ న్యూస్ ఏంటి అన్నది రేపు ఉదయం 09:09 గంటలకు రిలీజ్ చేస్తారని దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  అందుతున్న సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరూ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.  దీంతో పాటు మ్యూజిక్ ట్రీట్ కూడా ఉంటుందని సామాచారం.  కాశ్మీర్లో ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరుపుకుంటోంది.  అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన ట్రైన్ సెట్ లో సినిమాను షూట్ చేస్తున్నారు.  రష్మిక మందన్న హీరోయిన్.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది.