ఆశ్చర్యంలో మహేష్ బాబు !

ఆశ్చర్యంలో మహేష్ బాబు !

సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఈరోజు ఏఎంబీ సినిమా హాల్లో లాంచ్ చేసిన సంగతి  తెలిసిందే.  అభిమానులు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతుండగా మహేష్ కూడా ఆశ్చర్యపోయారు.  బొమ్మను చూస్తే తనలాంటి ఇంకోకర్ని చూసినట్టు ఉందని అన్నారు.  అంత ఖచ్చితంగా బొమ్మను  తయారుచేసిన కళాకారులకు హ్యాట్సాఫ్ అంటూ తన సొంత నగరంలో విగ్రహాన్ని లాంచ్ చేసినందుకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారికి కృతజ్ఞతలు చెప్పారు.  అంతేకాదు స్వయంగా తన బొమ్మతో తానే ఒక సెల్ఫీ కూడా దిగారు.  అభిమానుల సందర్శనార్థం ఈరోజు మొత్తం విగ్రహం నగరంలోనే ఉండనుంది.