ఆ ముగ్గురిలో మహేష్ తదుపరి డైరెక్టర్ ఎవరు?

ఆ ముగ్గురిలో మహేష్ తదుపరి డైరెక్టర్ ఎవరు?

ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2022 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత మహేష్ ఎస్ఎస్ రాజమౌళితో  సినిమా కమిట్ అయ్యాడు. ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుంది. ఆ తర్వాత రాజమౌళి కొంత గ్యాప్ తీసుకుని మహేశ్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తాడు. ఈ లోగా మహేశ్ మరో సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అది ఎవరితో అన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్.

ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం మహేష్ బాబు తదుపరి సినిమాపై ముగ్గురు దర్శకుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ తో ఇప్పటికే 'అతడు, ఖలేజా' వంటి సినిమాలు చేసి ఉన్నాడు. అలాగే త్రివిక్రమ్ తో పాటు 'సరిలేరు నీకెవ్వరు' వంటి మంచి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి పేరు కూడా బలంగా వినవస్తోంది. ఇక వీరిద్దరితో పాటు 'మహర్షి' లాంటి జాతీయ అవార్డు చిత్రం తీసిన పైడిపల్లి వంశీ పేరు కూడా వైరల్ అవుతోంది. ఇప్పటికే మహేష్ కు వంశీ కథ కూడా వినిపించాడట. మరి ఈ ముగ్గురిలో మహేష్ ఓటు ఎవరికీ పడుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సస్పెన్స్ కు మహేష్ బాబు ఎప్పుడు తెరదించుతాడో చూడాలి.