బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్

బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్

మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ శెరవేగంగా యూఎస్ లో జరుగుతున్నది.  ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.  వంశి పైడిపల్లి చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  మహేష్ బాబు 25 వ సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  భరత్ అనే నేను తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి.  ఇందులో మహేష్ బాబు స్టూడెంట్ గా, రైతుగా కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.  స్టూడెంట్ గెటప్ లో మహేష్ సూపర్బ్ గా ఉన్నాడు.  రైతుగా ఎలా ఉంటాడో అన్నది తెలియాలి.  

సినిమా రిలీజ్ విషయంలో బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తున్నది.  మొదట ఈ సినిమాను ఏప్రిల్ 29 న రిలీజ్ చేయాలని అనుకున్నారు.  కానీ, అనూహ్యంగా మూడు వారాలు ముందుకు వచ్చి, ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతున్నది.  బాహుబలి 2 సినిమా కూడా ఏప్రిల్ 5 న రిలీజ్ అయ్యి సూపర్బ్ వసూళ్లు సాధించింది.  ఇదే సెంటిమెంట్ తో మహర్షి సినిమాను కూడా ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది.  మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.