మహర్షి టైటిల్ చెప్పిన కథ..!!

మహర్షి టైటిల్ చెప్పిన కథ..!!

మహేష్ 25 వ సినిమా మహర్షి.  వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9 న రిలీజ్ చేశారు.  ఈ సినిమాలో మహేష్ పాత్రపేరు రిషి.  ఇది కన్ఫర్మ్ అయింది.  మహేష్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నారు.  మహేష్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తున్నది.  మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు.  

మహర్షి టైటిల్ రిలీజ్ తరువాత ఈ టైటిల్ పై మహేష్ ఫ్యాన్స్ రీసెర్చ్ చేస్తున్నారు.  సినిమా టైటిల్ లో ఏమున్నది.  ఈ టైటిల్ కథ ఏంటి అనే దానిపై సెర్చ్ చేస్తున్నారు.  రిషి మహేష్ పేరుకాగా, మహా అన్నది పూజా పాత్ర పేరు అయ్యిండచ్చు.  ఈ టైటిల్ లో మనకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది.  ఇది గొప్పదనానికి చిహ్నం.  టైటిల్ లోగో పైగా కొబ్బరి చెట్లు.. సాధారణమైన పల్లెటూరు కనిపిస్తాయి.  కింది భాగంలో అమెరికా భవంతులు కనిపిస్తాయి.  మధ్యలో కనిపించి కనిపించినట్టు కొన్ని అక్షరాలు.  అంటే చదువుకునే రోజులను గుర్తు చేస్తుంది.  రిషి చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లి సెటిల్ అవుతాడు.. అక్కడి నుంచి ఇండియా వచ్చి.. పల్లెటూరిలోని కొన్ని సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే విషయం ఈ సినిమాలో చూపించవచ్చు.  ఈ టైటిల్ ను చూస్తుంటే మనకు అదే గుర్తుకు వస్తున్నది.  ఇది ప్రస్తుతానికి ఊహ మాత్రమే.. కథ ఏంటో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.