మహేష్ లేకుండానే ఓపెనింగ్...!!

మహేష్ లేకుండానే ఓపెనింగ్...!!

మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సినిమా సూపర్ హిట్టైంది.  ప్రస్తుతం హీరో తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు.  25 రోజుల హాలిడే ట్రిప్ తరువాత ఇండియాకు తిరిగి వస్తారు. ఇండియా వచ్చిన తరువాత మహేష్... అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు.  మహేష్ 26 సినిమా ఓపెనింగ్ సమయంలో మహేష్ అందుబాటులో ఉండదని తెలుస్తోంది.  

మే 31 వ తేదీన సినిమాను ఓపెన్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.  మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఆ రోజున సినిమా ఓపెనింగ్ చేయబోతున్నారు.  సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ హాజరుకారు.  విదేశాల నుంచి వచ్చాక డైరెక్ట్ గా సినిమా షూటింగ్ లో పాల్గొంటారట.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.