మ‌హేష్ 25.. ఎగ్జోటిక్‌ లొకేష‌న్ల‌లో

మ‌హేష్ 25.. ఎగ్జోటిక్‌ లొకేష‌న్ల‌లో
మ‌హేష్ క‌థానాయ‌కుడుగా న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` ఈనెల 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు స‌హా విదేశాల్లో భారీగా రిలీజ‌వుతోంది. కేవ‌లం ఓవ‌ర్సీస్‌లో 2000 స్క్రీన్ల‌లో ప్రీమియ‌ర్లు వేయ‌డం ఓ సెన్సేష‌న్‌. మ‌హేష్ అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా వేచి చూస్తున్న మూవ్‌మెంట్ ఇది. మ‌రో ఐదు రోజుల్లోనే భ‌ర‌త్ రిపోర్ట్ అంద‌నుంది. ఇదే సంద‌ర్భంగా మ‌హేష్ (25) ల్యాండ్ మార్క్ సినిమా తాజా అప్‌డేట్ అందింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ మూవీ జూన్‌లో ప్రారంభం కానుంది. అమెరికాలో మెజారిటీ పార్ట్ తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించి లొకేష‌న్ సెర్చ్ పూర్త‌యింది. ఛాయాగ్రాహ‌కుడు పి.ఎస్‌.వినోద్ లొకేష‌న్ల‌ను ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే క‌థానాయిక‌గా ఫైన‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. దిల్‌రాజు- అశ్వ‌నిద‌త్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.