నవాబ్ ను ప్రమోట్ చేస్తున్న మహేష్ బాబు..!!

నవాబ్ ను ప్రమోట్ చేస్తున్న మహేష్ బాబు..!!

మణిరత్నం నవాబ్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ దూసుకుపోతున్నది.  మణిరత్నం ఈజ్ బ్యాక్ అనే విధంగా సినిమా ఉన్నది.  ఆధిపత్యం కోసం నలుగురు అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా.  

నవాబ్ సినిమా కోసం మొదట మహేష్ బాబు ను మణిరత్నం టీమ్ అప్రోచ్ అయ్యారట.  అనుకోని విధంగా మహేష్ బాబు ఆ సినిమాలో నటించలేదు.  కారణాలు ఏవైనా కావొచ్చు.  సినిమా మంచి విజయం సాధించడంతో మహేష్ ఈ సినిమా గురించి ట్విట్టర్లో చిన్న పోస్ట్ చేశారు.  మణిరత్నం అభిమానిగా గతంలో చెన్నైలో అనేక సినిమాలు చూశాను.  థియేటర్స్ లో చూసినప్పుడు ఎలాంటి ఉత్సాహం ఉండేదో ఇప్పుడు ఇంట్లోని హోమ్ థియేటర్ లో చూస్తున్నా అదే విధమైన ఉత్సాహం వస్తుందని ట్వీట్ చేశారు.  అందరు సినిమా చూడాలని మహేష్ కోరడం విశేషం.