మహేష్ రిటర్న్ పై వరల్డ్ కప్ ఎఫెక్ట్..!!

మహేష్ రిటర్న్ పై వరల్డ్ కప్ ఎఫెక్ట్..!!

మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత విదేశాలకు వెళ్లారు.  అక్కడ వివిధ దేశాలు తిరుగుతూ ఇప్పడు లండన్ చేరుకున్నారు. ఇంగ్లాండ్ లోని కేవింగ్టన్ ఓవల్ గ్రౌండ్ లో ఆదివారం రోజున ఇండియా..ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు మ్యాచ్ జరగనున్నది.  ఈ మ్యాచ్ ను మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి చూడబోతున్నారు.  

ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కాబట్టి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది.  ఇప్పటికే ఇండియా సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి మంచి ఊపుమీదుంది.  ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ కాబట్టి ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ తరువాత మహేష్ ఇండియా వస్తాడా లేదంటే వరల్డ్ కప్ అయ్యే వరకు అక్కడే ఉంటారా అన్నది తెలియాలి.