మహేష్ మానియా మొదలైంది.. ఆ థియేటర్ వద్ద భారీ కటౌట్..!!

మహేష్ మానియా మొదలైంది.. ఆ థియేటర్ వద్ద భారీ కటౌట్..!!

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికి యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నది.  మాస్ క్లాస్ కు నచ్చే విధంగా టీజర్ ఉండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  పక్కా ఫ్యామిలీ ఎంటెర్టైనెర్జ్ వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  

టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది.  భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ప్రమోషన్ చేస్తున్నారు.  నగరంలోని సుదర్శన్ థియేటర్ దగ్గర 80 కటౌట్ ను ఏర్పాటు చేశారు.  ఇంకా సినిమా రిలీజ్ కు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అభిమాన హీరో కటౌట్ ఏర్పాటు చేసి ప్రమోట్ చేస్తున్నారు.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్.  విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది.