అఫీషియల్ : మహేష్ తో పోటీకి సిద్దమైన బన్నీ..

అఫీషియల్ : మహేష్ తో పోటీకి సిద్దమైన బన్నీ..

2020 సంక్రాంతి మరింత కలర్ఫుల్ గాను, పవర్ఫుల్ గాను మారబోతున్నది.  2020 సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  ఇప్పటికే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  సినిమా టైటిల్ ప్రకటించిన రోజునే రిలీజ్ ను ప్రకటించారు.  

ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది.  వేగంగా షూట్ చేస్తున్నారు.  ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది.  త్వరగా సినిమాను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు బన్నీ.  ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  

అల్లు అర్జున్ 19 వ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.  అంటే, మహేష్, బన్నీ సినిమాలు రెండు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.  ఈ రెండు  పెద్ద సినిమాలే.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే.  అయితే, సంక్రాంతికి ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ ఆవుతుంది అనే దానిపై ఓ క్లారిటి రావలసి ఉంది.