మహేష్ సరిలేరు నీకెవ్వరూ నుంచి మరో పిక్ లీక్..!!

మహేష్ సరిలేరు నీకెవ్వరూ నుంచి మరో పిక్ లీక్..!!

మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో వేగంగా జరుగుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇందులో మహేష్ బాబు ఆర్మీ మేజర్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.  రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ నుంచి మహేష్ మేజర్ డ్రెస్ లో ఉన్న ఫోటో లీక్ అయ్యింది.  ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.  

ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుంచి మరో పిక్ లీక్ అయ్యింది.  ఈ పిక్ లో మహేష్ బాబు క్రీడామైదానంలో నిలబడి ఉంటాడు.  ఈ సీన్ రహస్యం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. క్రీడా మైదానంలో ఆర్మీకి పరేడ్ కు సంబంధించిన సీన్స్ తీస్తున్నారా లేదంటే మరేదైనా తీసుతున్నారా లేక మహేష్ వేరే యాడ్ కోసం చేస్తున్నారా అన్నది తెలియాలి.  అందుతున్న సమాచారం ప్రకారం ఇది సరిలేరు నీకెవ్వరూ సెట్స్ కు సంబంధించిన ఫోటో అనే అర్ధం అవుతున్నది.