మహేష్ సరిలేరు నీకెవ్వరూ టీజర్ డేట్ వచ్చేసింది 

మహేష్ సరిలేరు నీకెవ్వరూ టీజర్ డేట్ వచ్చేసింది 

మహెహ్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను యూనిట్ ప్రకటించింది.  సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.  ఆ టీజర్ కు సంబంధించిన డేట్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  

నవంబర్ 22 వ తేదీన టీజర్ రిలీజ్ కాబోతున్నది.  టీజర్ డేట్ రిలీజ్ చేయడంతో ఎలా ఉండబోతుంది అనే దానిపై అంచనాలు పెరిగాయి.  మహేష్ బాబు కాశ్మీర్ లో ఆర్మీ మేజర్ గా ఉన్నపుడు అక్కడి సన్నివేశాలు, కర్నూలుకు సంబందించిన కొన్ని సన్నివేశాలను టీజర్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పోషిస్తోంది.  జనవరి 12 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.