మహేష్ కు సరిలేరు ఇంకెవ్వరూ... 

మహేష్ కు సరిలేరు ఇంకెవ్వరూ... 

మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ కొద్దీ సేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ఈ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉన్నది.  మహేష్ బాబు పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్నీ ఈ టీజర్ ద్వారా స్పష్టంగా తేలింది.  మేజర్ పాత్రలో కాశ్మీర్లో అదరగొట్టిన మహేష్, శత్రువులు బోర్డర్లోనే కాదు.. సమాజంలో మనమధ్యనే ఉంటారు.  మన మధ్యలో ఉన్న శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కథ.  1:26 నిముషాలు ఉన్న ఈ టీజర్ గూస్ బమ్స్ అని చెప్పొచ్చు.  

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  రష్మిక మందన్న హీరోయిన్ కాగా, విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది.