నిజమైన 'రా' చిత్రం రంగస్థలం: మహేష్ బాబు

నిజమైన 'రా' చిత్రం రంగస్థలం: మహేష్ బాబు
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్, 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు పొరుగు రాష్ట్రం తమిళనాట నుండి కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. ఇక ఓవర్సీస్ లో కూడా తన పంజా విసిరాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసల వర్షంలో తడిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ 'సూపర్ స్టార్' రంగస్థలం సినిమాను చూసి ట్విట్టర్ లో తనదైన శైలిలో ప్రసంశలు కురిపించాడు. 'మైత్రి మూవీస్ సంస్థ మరోసారి మంచి సినిమాతో రాణించారు. రామ్ చరణ్, సమంత అద్భుతంగా నటించారు. ఇద్దరు తమ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. సినిమా మొత్తం ఎంజాయ్ చేసాను. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు' అని ట్వీటాడు. 'రంగస్థలం సినిమా స్వచ్ఛంగా, సహజంగా ఉంది. మంచి కళాభిరుచి ఉన్న డైరెక్టర్ సుకుమార్. దేవిశ్రీ అన్ని పాటలకు సరైన సంగీతం అందించి రాక్ స్టార్ అయ్యాడు. రత్నవేలు డీఓపీ చాలా బాగుంది' అని మరో ట్వీట్ లో తెలిపాడు. ఈ రకమైన ట్వీట్లు పెట్టి తన పెద్ద మనసును చాటుకున్నాడు మహేష్. ఇంతకుముందు రంగస్థలం సినిమా చూసిన సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ప్రశంసిస్తూ మెసేజ్‌ చేసిన విషయం తెలిసిందే.