టైటిల్ లీక్ పై మహేష్ అసహనం...

టైటిల్ లీక్ పై మహేష్ అసహనం...

సూపర్ స్టార్ మహేష్ బాబు  ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాల్సింది. లాక్ డౌన్ కారణంగా ఈసినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భముగా తన కొత్త సినిమా అప్డేట్ ను అనౌన్స్ చేయడం మహేష్ ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఈసినిమా కూడా అలా చేయాలనీ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈ లోగా సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో హల్చల్ మొదలైంది. 

ఈ సినిమాకు 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ను ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ టైటిల్ ను కృష్ణ పుట్టిన రోజున గ్రాండ్ గా లాంచ్  చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈ లోగా టైటిల్ లీక్ అయ్యింది . 'సర్కార్ వారి పాట ' టైటిల్ ను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇక టైటిల్ లీక్ పై మహేష్ బాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. టైటిల్ ఎలా లీక్ అయ్యిందో తెలుసుకోవాలని  పీఆర్ టీమ్ ను  మహేష్ ఆదేశించారని వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలో ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఆ టైటిల్ పోస్టర్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు వహించాలని మహేష్ సూచించాడట.  బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న భారీ మోసాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది.