నమ్రత బర్త్ డే: వెరైటీగా విష్ చేసిన మహేష్

నమ్రత బర్త్ డే: వెరైటీగా విష్ చేసిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య 'నమ్రత శిరోద్కర్' పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ తన సతీమణి నమ్రతపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు ప్రిన్స్ మహేష్. 'నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు.. ప్రతిరోజు నీతో గడపడం ప్రత్యేకమైనదే.. కానీ ఈ రోజు అది మరింత ప్రత్యేకం'.. ఈరోజు నమ్రత పుట్టినరోజు కావడంతో ఇది తనకు ఎంతో స్పెషల్ డే అంటూ మహేష్ బాబు ఇద్దరు కలిసి దుబాయ్ లో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ప్రముఖులు, మహేష్ ఫ్యాన్స్ విషెస్ తో నమ్రత పేరు ట్విట్టర్ లో హోరెత్తుతోంది. మహేష్ ఫ్యామిలీ నమ్రత పుట్టినరోజు వేడుకల కోసం నిన్న దుబాయ్ వెళ్లారు. దుబాయ్ ట్రిప్ అనంతరం మహేష్ 'సర్కార్ వారి పాట' సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. కాగా, మహేష్ షూటింగ్ కోసమే దుబాయ్ వెళ్లాడని, నమ్రత పుట్టిన రోజులు కూడా అక్కడే జరుపోవడానికి ఫ్యామిలిని కూడా తీసుకెళ్లాడని తెలుస్తోంది. మరోవైపు 'సర్కార్ వారి పాట' దుబాయ్ షూటింగ్ షెడ్యూల్ రద్దయిందని హైదరాబాద్ లోనే ఈ సినిమా సెట్స్ కూడా వేశారనే టాక్ వినిపిస్తోంది.