సుక్కు.. మహేష్ సినిమా మరింత ఆలస్యం..?

సుక్కు.. మహేష్ సినిమా మరింత ఆలస్యం..?

భరత్ అనే నేను హిట్ తరువాత మహేష్ తన 25 వ సినిమా మహర్షి చేస్తున్నారు.  ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకుడు.  దిల్ రాజు, అశ్వినిదత్, పివిపి సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  పూజా హెగ్డే హీరోయిన్ కాగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఈ సినిమా అనంతరం మహేష్ బాబు రంగస్థలం దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. 

ఈ సినిమా కథను కూడా రెడీ చేశారు.  మహేష్ కు కథ నచ్చలేదని.. మరో కథను చేద్దామని చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కోసం సుకుమార్ కథను రెడీ చేసే పనిలో ఉన్నారు.  ఒకవేళ కథ ఆలస్యం అయితే.. మహేష్ మరో దర్శకుడితో కమిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ, అజయ్ భూపతి, పరశురామ్ లతో టచ్ లో ఉన్నారని, వారిని కూడా కథలు సిద్ధం చేసుకోమని చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.  మహేష్ మహర్షి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.