మహేష్ ప్లాన్ అదుర్స్..!!

మహేష్ ప్లాన్ అదుర్స్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.  పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు.  ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ ఫోన్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకొని మే 9 వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది.  ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండటంతో సినిమాను మే కు పోస్ట్ ఫోన్ చేశారు.  

ఈ విషయాన్ని పక్కన పెడితే.. మహేష్ 26 వ సినిమా సుకుమార్ తో చేయాల్సి ఉంది.  రంగస్థలం తరువాత సుకుమార్ కు డిమాండ్ భారీగా పెరిగింది.  గతంలో మహేష్ తో చేసిన 1 నేనొక్కడినే సినిమా దారుణంగా ఫెయిల్ అయింది.  ఇప్పుడు కథల విషయంలో మహేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.  సుకుమార్ తో సినిమా అంటే స్క్రిప్ట్ అంత త్వరగా పూర్తికాదు.  సినిమాను షూట్ చేయడం మొదలు పెడితే చాలా సమయం తీసుకుంటుంది. పైగా హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు.  దీంతో సుకుమార్ సినిమాను పక్కన పెట్టి, అనిల్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  అనిల్ సినిమాను స్పీడ్ గా కంప్లీట్ చేస్తాడు.  అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ అవుతుంది.  

సుకుమార్ సినిమాను క్యాన్సిల్ చేసుకోవటానికి కారణం ఉందని తెలుస్తోంది.  వచ్చే ఏడాది అంటే 2020 లో మహేష్ బాబు.. రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా ఉండబోతున్నది.  ఈ సినిమా వరకు అన్నింటిని పూర్తి చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు మహేష్.  అందుకే అనిల్ తో సినిమా చేసేందుకు ఒకే చెప్పాడని సమాచారం.