నమ్రతా సినిమాలో మహేష్ బాబు..?

నమ్రతా సినిమాలో మహేష్ బాబు..?

మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా మహర్షి షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో సినిమా ఉంటుంది.  దీనికోసం సుకుమార్ కథను రెడీ చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, మహేష్ బాబు సుకుమార్ సినిమాతో పాటు మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.  

మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చిన్న సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.  కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు.. కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట.  ఇప్పటికే కొంతమంది కొత్త దర్శకులకు ఆమె అడ్వాన్స్లు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. 

కృష్ణవంశి దర్శకత్వం వహించిన అనంతపురం తరహాలో ఓ కథతో సినిమా త్వరలోనే స్టార్ చేయబోతున్నట్టు సమాచారం.  దీనికి సంబంధించిన క్యాస్టింగ్ ను కూడా ఎంపిక చేస్తున్నారట.  ఇందులో ఓ కీలక పాత్రలో మహేష్ నటిస్తున్నారని సమాచారం.  దాదాపు ఆ పాత్ర 30 నిమిషాలసేపు ఉంటుందని తెలుస్తున్నది.  ఇది నిజమైతే.. నమ్రతా నిర్మిస్తున్న చిన్న సినిమా పెద్ద సినిమాగా మారే అవకాశం ఉంటుంది.