కృష్ణ హిట్ జానర్లో మహేష్ మూవీ... 

కృష్ణ హిట్ జానర్లో మహేష్ మూవీ... 

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా అనేక ప్రయోగాలు చేశారు.  అలా చేసిన ప్రయోగాల్లో ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాలు ఉన్నాయి.  జేమ్స్ బాండ్ తరహా పాత్రలు తీసుకొని వాటిని ఇండియన్ నేటివిటీ అద్ది సినిమాలు తీసేవారు.  ఈ సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.  ఇదే తరహాలో మహేష్ బాబు గతంలో టక్కరి దొంగ సినిమా చేశారు.  ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదుగాని, మహేష్ బాబు ఆ పాత్రలో మంచి మెప్పించారు.  

కాగా, ఇప్పుడు మహేష్ బాబు 27 వ సినిమాలో జేమ్స్ బ్యాండ్ తరహా పాత్రలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు.  వంశి పైడిపల్లి ఈ తరహా పాత్రను మహేష్ కోసం సృష్టిస్తున్నారని సమాచారం.  మే నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  మరి చూద్దాం ఏమౌతుందో.