మేజర్ పాత్రలో మహేష్ !

మేజర్ పాత్రలో మహేష్ !

మహేష్ బాబు తన తరవాతి చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో ఇంతకు మునుపెన్నడూ చేయని పాత్రను చేయనున్నారు.  అదే ఆర్మీ మేజర్ పాత్ర.  ఇది చాలా పవర్ఫుల్ రోల్ అని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అంటున్నారు.   సినిమా పేరుకి, అందులోని కథకు హీరో పాత్ర సరిగ్గా సరిపోతుందని, తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చెప్పుకొచ్చారు.  సంగీత దర్శకుడు దేవి శ్రీ మాట్లాడుతూ సినిమాలో ఎంటర్టైన్మెంట్, భావోద్వేగానికి గురిచేసే ఎమోషన్ ఉంటాయని ఇదొక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని అన్నారు.  రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, సుంకర రామబ్రహ్మం, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.