చిన్న సినిమాల కోసం మహేష్ ముందడుగు !

చిన్న సినిమాల కోసం మహేష్ ముందడుగు !

హీరోగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్.  ఇప్పటికే మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన తాజాగా ఏషియన్ సినిమాస్ తో చేతులు కలిపి థియేటర్ల వ్యాపారంలోకి కూడ దిగారు. 

ఇవి మాత్రం కాకుండా ఆయన త్వరలోనే మరొక నిర్మాణ సంస్థను స్థాపించనున్నట్లు తెలుస్తోంది.  ఈ సంస్థ ద్వారా చిన్న సినిమాలను నిర్మించి కొత్త దర్శకులని, నటీనటుల్ని ప్రోత్సహించాలని మహేష్ భావిస్తున్నారట.  మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందించదగినదే.  ఇకపోతే ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేసున్న మహేష్ దాని తరవాత సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు.