మహేష్ బాబు విన్నపం: చట్టాలను కఠినం చేయండి 

మహేష్ బాబు విన్నపం: చట్టాలను కఠినం చేయండి 

ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనపై అనేక మంది సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు.  ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  ఇవి హేయమైన సంఘటనలు మరలా జరగకుండా చూడాలని ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.  కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఈ ఘటనపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే.  

ఇక ఇదిలా ఉంటె, ఈ ఘటనపై మహేష్ బాబు స్పందించారు.  ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనపై మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.  రోజు రోజుకు ఇలాంటి సంఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయని, వీటిపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మహేష్ బాబు తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రధాని కార్యాలయాన్ని కోరారు.  చట్టాలను కఠినతరం చేసి సత్వరమే పరిష్కారం జరిగేలా చూడాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు.