సైరా ట్రైలర్ పై మహేష్ రివ్యూ..! 

సైరా ట్రైలర్ పై మహేష్ రివ్యూ..! 

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ట్రైలర్ నిన్నటి రోజున రిలీజ్ అయ్యింది.  యూట్యూబ్ లో రిలీజైన క్షణం నుంచి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  24 గంటల్లో 34 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.  విజువల్ వండర్ గా ట్రైలర్ ఉంది.  ఇక మెగాస్టార్ తన నటవిశ్వరూపాన్ని సినిమాలో చూపించాడు. మరోవైపు సూపర్ స్టార్ అమితాబ్ సినిమాలో కీలక పాత్ర చేస్తుండటం బాలీవుడ్ లో రిలీజ్ కు అనుకూలంగా మారింది.  

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ ట్రైలర్ పై టాలీవుడ్ సూపర్ స్టార్ స్పందించారు.  ట్రైలర్ విజువల్ వండర్ గా ఉందని, ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.  మెగాస్టార్  చిరంజీవి యాక్టింగ్ సూపర్బ్ అని చెప్పిన మహేష్, అమితాబ్, చరణ్, సురేందర్ రెడ్డి, డీవోపీ రత్నవేలుకు అలాగే యూనిట్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.