ఎట్టకేలకు రిలాక్స్ అంటున్న మహేష్ !

ఎట్టకేలకు రిలాక్స్ అంటున్న మహేష్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నడూ లేనంతగా 'మహర్షి' సినిమా కోసం కష్టపడ్డారు.  ప్రమోషన్లలో విపరీతంగా పాల్గొన్నారు.  టీవీ, పేపర్ అని తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నారు.  థియేటర్ కవరేజ్, సక్సెస్ మీట్స్, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి సినిమాకు బోలెడంత పబ్లిసిటీ తెచ్చారు.  ప్లాన్ చేసుకున్న అన్ని కార్యక్రమాలు ముగియడంతో ఆయన కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పుకు బయలుదేరారు.  'మహర్షి' సక్సెస్ మూలాన ఈ ట్రిప్ మర్చిపోలేనిదిగా మారిందని చెప్పుకొచ్చారు మహేష్.