మహేష్ చేతుల మీదుగా నితిన్ ట్రైలర్

మహేష్ చేతుల మీదుగా నితిన్ ట్రైలర్

దిల్ రాజు బ్యానర్లో నితిన్ హీరోగా వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం.  శతమానం భవతి వంటి చక్కని సినిమాను తీసిన వేగేశ్న సతీష్ ఈ శ్రీనివాస కళ్యాణం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఆగష్టు 9 న సినిమా విడుదల తేదీని లాక్ చేసిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 2 వ తేదీ సాయంత్రం విడుదల కాబోతున్నది.  శ్రీనివాస కళ్యాణం టైటిల్ సాంగ్ టీజర్ ఇప్పటికే అందరిని ఆకట్టుకున్నది.  

కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శక నిర్మాతలు.  దిల్ రాజు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.  ఇదిలా ఉంటె ఈ సినిమా ట్రైలర్ ఆగష్టు 2 వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కాబోతున్నది.  గతంలో నితిన్ సినిమాలకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాను మహేష్ బాబు ప్రమోట్ చేస్తున్నాడు.  మహేష్ ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 9 వ తేదీ వరకు ఆగాల్సిందే.