చాలా ఆనందంగా ఉంది - మహేష్ బాబు

చాలా ఆనందంగా ఉంది - మహేష్ బాబు

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగాయి.  ఈ ఎన్నికల్లో వైకాపా 22 సీట్లు గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  గుంటూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన గల్లా జయదేవ్ అనూహ్యంగా విజయం సాధించారు.  వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4800 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.  

మొదటినుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన మోదుగులను చివర్లో గల్లా పుంజుకొని ఓడించడం విశేషం.  గల్లా విజయంపై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు.  గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేసి రెండుసారి విజయం సాధించిన గల్లా జయదేవ్ కు మహేష్ శుభాకాంక్షలు తెలిపారు.  ఇది మరుపురాని విజయంగా ఆయన పేర్కొన్నారు.