మహేష్ ను వదలని మురుగదాస్..!!

మహేష్ ను వదలని మురుగదాస్..!!

బ్రహ్మోత్సవం సినిమా తరువాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో మహేష్ బాబు.. క్రియేటివ్ దర్శకుడు మురుగదాస్ తో కలిసి స్పైడర్ సినిమా చేశారు.  సినిమా టైటిల్, ట్రైలర్ సూపర్బ్ గా రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  అటు కోలీవుడ్ లో మహేష్ బాబును భారీ ఎత్తున లాంచింగ్ కూడా చేశారు.  తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే.. భారీ ప్లాప్ అయింది.  మహేష్ కెరీర్లో భారీ లాస్ వచ్చిన సినిమాగా స్పైడర్ నిలిచింది.  

వెంటనే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేసి ప్లాప్ నుంచి బయటపడ్డాడు.  అటు మురుగదాస్ కూడా విజయ్ తో సర్కార్ స్టార్ట్ చేసి దీపావళికి రిలీజ్ చేస్తున్నాడు.  సినిమా విషయంలో ఎంత అలర్ట్ గా ఉంటాడో.. సోషల్ మీడియాలో కూడా మురుగదాస్ అంతే స్పీడ్ గా ఉంటాడు.  ఇలాంటి క్రియేటివ్ దర్శకుడు, తన ట్విట్టర్ పేజీ వాల్ పేపర్ గా స్పైడర్ మూవీ పోస్టర్ నే ఉంచాడు.  ఇలా ఎందుకు ఉంచాడు అన్న విషయం ఎవరికీ తెలియదు.  కొత్త సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన పిక్ ను వాల్ పేపర్లో పెట్టుకుంటారు.  మురుగదాస్ మాత్రం స్పైడర్ ను డిస్ప్లే చేస్తున్నాడు. ఇలా ఎందుకు ఉంచాడు అన్నది మురుగదాస్ కు మాత్రమే తెలియాలి.