ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న మహేష్ స్నిక్ పీక్

ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న మహేష్ స్నిక్ పీక్

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనం బొమ్మను మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన స్నిక్ పీక్ ఒకటి ట్విట్టర్ లో మహేష్ అభిమానులు పోస్ట్ చేశారు.  తలవరకు పూర్తయిన బొమ్మ అచ్చు మహేష్ బాబును పోలి ఉన్నది.  మహేష్ మైనపు బొమ్మను తయారు చేసే బాధ్యతను ఇవాన్ రీస్ తీసుకున్నాడు.  ప్రస్తుతం ఆయన మహేష్ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నారు.  మహేష్ బాబు ఫ్యాన్స్ పోస్ట్ చేసిన ఈ స్నిక్ పీక్ ఫోటో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నది.